schedule Monday, September 07, 2026

రామ మందిరంకు ఎమ్మెల్యే విరాళం..!

calendar_today March 11, 2026
person dharshininews
రామ మందిరంకు ఎమ్మెల్యే విరాళం..!
రామ మందిరంకు ఎమ్మెల్యే విరాళం..! - రూ. 1లక్ష ప్రకటించిన మనోహర్ రెడ్డి - పున ప్రతిష్ట ఉత్సవాలకు రావాలని ఆహ్వానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్‌లోని ఏకైక రామ మందిరంకు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విరాళం ప్రకటించారు. బుధవారం దేవాలయ కమిటి సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దేవాలయ పునర్ నిర్మాణంకు పురస్కరించుకుని తన వంతుగా రూ.1లక్షను విరాళంగా ప్రకటించారు. అదేవిధంగా ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు పున ప్రతిష్టపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవాలు జరుపుతున్నట్లు కమిటి సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఐదు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాజకీయ నాయకులు ప్రముఖులు వ్యాపారవేత్తలు ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున పాల్గొని తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కమిటి సభ్యులు కోరారు. https://www.dharshininews.com/42409/