schedule Monday, September 07, 2026

పెళ్లికి వెళితే.. ఇళ్లు గుల్ల..!

calendar_today March 11, 2026
person dharshininews
పెళ్లికి వెళితే.. ఇళ్లు గుల్ల..!
పెళ్లికి వెళితే.. ఇళ్లు గుల్ల..! - తాళం వేసిన ఇంట్లో చోరీ - బంగారం, వెండి, నగదు ఆపహరణ - తాండూరు సాయిపూర్‌లో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : బందువుల ఇంట్లో జరిగిన పెళ్లికి వెళ్లి వచ్చే సరికి గుర్తుతెలియని దొంగలు ఇళ్లును గుల్ల చేశారు. ఇంట్లో దాచుకున్న బంగారం, వెండి ఆబరణాలతో పాటు నగదుతో ఉడాయించారు. ఈ సంఘటన బుధవారం తాండూరు పట్టణం సాయిపూర్‌లో వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాయిపూర్‌ ప్రాంతానికి చెందిన అంజిలయ్య తమ బందువుల ఇంట్లో పెళ్లి ఉందని వారం రోజుల క్రితం కుటుంబంతో కలిసి ఊరెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దుండగులు కన్నం వేశారు. ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి బీరువాలో 8గ్రాముల బంగారం, కొంత వెండి ఆభరణాలతో పాటు రూ. 50 వేల నగదును ఎత్తుకెళ్లారు. బుధవారం ఇంటికి చేరుకున్న అంజిలయ్య కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు తెరిచి ఉండటం చూసి ఆందోళనకు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని నగదు, నగలు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. https://www.dharshininews.com/42439/