schedule Monday, September 07, 2026

సుస్థిర సుందరీకరణే ధ్యేయం

calendar_today March 14, 2026
person dharshininews
సుస్థిర సుందరీకరణే ధ్యేయం
సుస్థిర సుందరీకరణే ధ్యేయం - సొంతింటిలా పరిశుభ్రతకు ప్రాధాన్యం - వ్యర్థాలను బయట పారేయొద్దు - మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి - పరిశుభ్రతపై పట్టణ ప్రజలకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని జంక్షన్లలో సుస్థిర సుందరీకరణ ధ్యేయంగా ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కొనసాగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. శనివారం 99రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వేస్ట్‌ టు ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌ థీమ్ చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, ఇందిరా చౌరస్తాలోని ప్రాంతాలలో సుందరీకణ పనులు చేపట్టారు. వ్యర్థాలుగా పడేసిన పాత టైర్లలో మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి హాజరై నాటిన మొక్కలకు నీళ్లు పోశారు. అనంతరం పరిసర ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. రోడ్లపై వ్యర్థాలు పడేరాదని సూచించారు. పట్టణ వీధులు, రోడ్లు, దుకాణాల పరిసరాలను సొంతింటిలా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సుస్థిర సుందరీకరణ కోసం పాటు పడడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్లు నాగారం మల్లేశం, శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, శానిటరి ఇనుస్పెక్టర్లు ఉమేష్‌, వెంకటయ్య, పారిశుద్ధ్య సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42527/