schedule Monday, September 07, 2026

భద్రేశ్వరుని ప్రతిష్ట పెంచాలి

calendar_today March 14, 2026
person dharshininews
భద్రేశ్వరుని ప్రతిష్ట పెంచాలి
భద్రేశ్వరుని ప్రతిష్ట పెంచాలి - కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి - బీఎస్‌ఆర్‌ను కలిసిన జాతర ఉత్సవ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని భద్రేశ్వర దేవాలయ ప్రతిష్టను పెంచెలా పనిచేయాలని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాండూరులోని భద్రేశ్వర జాతర ఉత్సవ కమిటి శనివాసం నియామకం అయ్యింది. అధ్యక్షులుగా మేడి మహేష్‌తో పాటు మరో ఏడుగురికి స్థానం కల్పించారు. ఇందులో భాగంగా అధ్యక్షులు మేడి మహేష్‌ ఆధ్వర్యంలో కమిటి సభ్యులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. జాతర ఉత్సవ కమిటిలో స్థానం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయ ప్రతిష్ట పెంచేలా పనిచేయాలని అన్నారు. భద్రేశ్వరుని జాతర ఉత్సవాలను బ్రహ్మండంగా నిర్వహించాలని అన్నారు. ప్రజలకు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. https://www.dharshininews.com/42532/