schedule Saturday, July 04, 2026

భద్రేశ్వరుని హుండి ఆధాయం లెక్కింపు

calendar_today March 18, 2026
person dharshininews
భద్రేశ్వరుని హుండి ఆధాయం లెక్కింపు
భద్రేశ్వరుని హుండి ఆధాయం లెక్కింపు - రూ. 1లక్ష 22వేల 736లుగా గుర్తింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయ హుండీ లెక్కింపు చేపట్టారు. బుధవారం జాతర కమిటి అధ్యక్షులు మేడి మహేష్‌ కుమార్, ఈఓ శేఖర్ గౌడ్‌ల సమక్షంలో లెక్కింపును నిర్వహించారు. ప్రతి యేడాది జాతర ఉత్సవాలకు ముందు స్వామి హుండీ లెక్కించడం ఆనవాయితి. ఇందులో భాగంగా దేవాలయంలో హుండీని లెక్కించారు. ఇందులో రూ. 1లక్ష 22వేల 736ల ఆధాయం ఉన్నట్లు గుర్తించారు. గత యేడాది రూ. 1లక్ష 27వేలు ఉండగా ఈసారి రూ. 5వేలు తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో జాతర ఉత్సవ కమిటి డైరెక్టర్లు గంగా శ్రావణ్ కుమార్, గాజుల విజయ్ కుమార్. లింగమంతుల శంకర్(దేవనూర్), శేట్టి చంద్రకాంత్, మద్రికే చంద్రకాంత్, కోర్వార్ అంజలి, అగ్గనూరు సంకేత్, వీరశైవ సమాజం అద్యక్ష కార్యదర్శులు, సమాజం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42623/