schedule Saturday, July 04, 2026

కమనీయం.. సీతా రాముల కళ్యాణం..!

calendar_today March 27, 2026
person dharshininews
కమనీయం.. సీతా రాముల కళ్యాణం..!
కమనీయం.. సీతా రాముల కళ్యాణం..! - కోటబాసపల్లిలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి - కళ్యాణం జరిపించిన నరసింహ రెడ్డి(బాబు) దంపతులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం కోటబాస్పల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామ నవమిని ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం మాజీ హోంమంత్రి సబితారెడ్డి సోదరుడు, సిటీకేబుల్ ఎండీ నరసింహారెడ్డి, సుస్మితారెడ్డి అధ్వర్యంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. నరసింహ రెడ్డి దంపతులు సీతా రాముల విగ్రహాలను వారి నివాసం నుంచి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. దేవాలయంలో పురోహితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం కళ్యాణం జరిపించారు. నరసింహారెడ్డి దంపతులు స్వామివారి పాదాల చెంత అక్షింతలు వేసి, కల్యాణ క్రతువును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు మాంగళ్యధారణ చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింహ రెడ్డి కుమారుడు తనుష్ రెడ్డి, కూతురు రోమికా రెడ్డి, సంధ్యా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ భర్త వెంకట్రామ్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నేతలు నాగప్ప, నర్సిరెడ్డి, కిష్టప్ప, శశిధర్, సీహెచ్ అశోక్, జగదీష్, వినయ్, కొండం రవి, కొండం శ్రీను, నరేందర్ చారీ, కరణం చందు, సురేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42850/