schedule Monday, September 07, 2026

ప్రజా కార్యక్రమాలపై కాంగ్రెస్ దౌర్జన్యం

calendar_today April 4, 2026
person dharshininews
ప్రజా కార్యక్రమాలపై కాంగ్రెస్ దౌర్జన్యం
ప్రజా కార్యక్రమాలపై కాంగ్రెస్ దౌర్జన్యం - కావాలనే ఓటింగ్‌ మ్యాపింగ్‌ అడ్డగింత - రానున్న రోజుల్లో తగిన శాస్తి తప్పదు - బీఆర్ఎస్ కౌన్సిలర్‌ ఈర్షాద్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకుని దౌర్జన్యానికి దిగడంపై తాండూరు మున్సిపల్‌ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఈర్షాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ఓటింగ్‌ మ్యాపింగ్‌ కోసం శనివారం కౌన్సిలర్ ఈర్షాద్ తన వార్డు 7లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజలు ఓటింగ్‌ మ్యాపింగ్ చేసుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు రావద్దని టెంటు, టేబుళ్లు వేసి ఏర్పాట్లు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నట్లు ఈర్షాద్ ఆరోపించారు. ప్రజల కోసం ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ఇలాంటి వైఖరి కాంగ్రెస్ నేతల అసలు రూపాన్ని బయటపెడుతుందని అన్నారు. వార్డు ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే గట్టి సమాధానం ఇస్తారని అన్నారు. అప్పడు కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. https://www.dharshininews.com/42948/