schedule Monday, September 07, 2026

లక్ష్మీ నర్సింహ స్వామి సేవలో ఎమ్మెల్యే

calendar_today April 6, 2026
person dharshininews
లక్ష్మీ నర్సింహ స్వామి సేవలో ఎమ్మెల్యే
లక్ష్మీ నర్సింహ స్వామి సేవలో ఎమ్మెల్యే - కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్న మనోహర్ రెడ్డి - ఆశీర్వదించిన దేవాలయ పురోహితులు తాండూరు, దర్శిని ప్రతినిధి: యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి సేవలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తరించారు. సోమవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకున్నారు. తల్లి, సతీమణితో దేవాలయంలో జరిగిన అభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దేవాలయ పురోహితులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులకు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు నియోజక వర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో.. సుభిక్షాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. https://www.dharshininews.com/42958/