schedule Monday, September 07, 2026

అమ్మ.. నాన్నలకు చెప్పండి..!

calendar_today April 15, 2026
person dharshininews
అమ్మ.. నాన్నలకు చెప్పండి..!
అమ్మ.. నాన్నలకు చెప్పండి..! - రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగం అవ్వండి - విద్యార్థులతో తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య - తాండూరులో ఆరైవ్‌ - అలైవ్‌లో అవగాహన తాండూరు, దర్శినిప్రతినిధి : రోడ్డు భద్రతల నియమాలపై ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలకు ప్రతి విద్యార్థి చెప్పాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న 90రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరైవ్ - అలైవ్‌ కార్యక్రమాలను చేపట్టారు. పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీఎస్పీ నర్సింగ్ యాదయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. బైకుపై వెళ్లే సమయంలో హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లే సమయంలో సీటు బెల్టులు ధరించాలని అమ్మా నాన్నలకు చెప్పాలని అన్నారు. అదేవిధంగా సెల్ ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని చెప్పాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని అన్నారు. ట్రాఫిక్ అవగాహన పెంచుకోవాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్, స్కూల్ కరస్పాండెంట్ పట్లోళ్ల సర్వోత్తమ్ రెడ్డి, డైరెక్టర్ ద్యావరి జయవర్దన్‌ రెడ్డి, ప్రిన్సిపల్ ఎన్. రమేష్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43084/