schedule Monday, September 07, 2026

రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి

calendar_today April 15, 2026
person dharshininews
రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి
రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి - సీతారాంపేట్ పాఠశాలలో అరైవ్ - అలైవ్ కార్యక్రమం - పాల్గొన్న మహిళ ఎస్ఐ, వార్డు కౌన్సిలర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని తాండూరు పట్టణ మహిళ ఎస్ఐ పుష్పలత రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ జుంటుపల్లి వెంకటేష్‌లు అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న 90 రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం తాండూరు పట్టణం సీతారాంపేట్‌ ప్రాథమిక పాఠశాలలో అరైవ్ - అలైవ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పుష్పలతా రెడ్డి విద్యార్థులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రోడ్డు నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్ రాములు, లైన్ మెన్ కిషన్, అంగన్వాడీ టీచర్ నిర్మల, ఆయా లక్ష్మి, ఆర్పీ వెంకటలక్ష్మి, ఓబీ సంగీత, మహిళ సమైక్య సభ్యురాలు సావిత్ర, ఇందిరమ్మ కమిటీ మెంబర్ సమద్, వినోద్, మనీష్ కిరణ్, మనోహర్, వేణు, రాజు పంతులు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43088/