schedule Saturday, July 04, 2026

కర్రలతో కొట్లాట..!

calendar_today May 6, 2026
person dharshininews
కర్రలతో కొట్లాట..!
కర్రలతో కొట్లాట..! - భగ్గుమన్న పాత కక్ష్యలు - నీళ్లపల్లి తాండాలో ఇరువర్గాల ఘర్షణ - పోలీసులకు పరస్పర ఫిర్యాదులు బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఇరు వర్గాల మద్య పాత కక్ష్యలు భగ్గుమన్నాయి. కర్రలను చేతిల్లో పట్టుకున్ని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంలోని నీళ్లపల్లి తాండాలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం తాండాకు చెందిన కొట్లాడుకున్నారు. తాండాకు చెందిన రెండు కుటుంబాల మద్య పాత కక్ష్యలు కొనసాగుతున్నాయని తాండా వాసులు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇరు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన వారు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరువర్గాలకు గాయాలు అయ్యాయి. గాయాలపాలైన వారిని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఇరువర్గాలు బషీరాబాద్‌ పోలీస్టేషన్‌కు చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు జరిపి చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదులపై 14 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. https://www.dharshininews.com/43234/