schedule Saturday, July 04, 2026

ఆపరేషన్.. నక్సల్స్..!

calendar_today May 10, 2026
person dharshininews
ఆపరేషన్.. నక్సల్స్..!
ఆపరేషన్.. నక్సల్స్..! - నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు - మహరాష్ట్ర పోలీసులకు అప్పగింత - తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తప్పించుకుని తిరుగుతున్న నక్సల్స్‌ కోసం పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలో నలుగురు నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు మహారాష్ట్ర చత్తీస్గడ్ చెందిన ముగ్గురు వ్యక్తులతో పాటు ఒక లేడీ నక్సలైట్‌పై అక్కడ కేసు నడుస్తోంది. అయితే ఈ నలుగురు నక్సలైట్స్‌ తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధి రుక్మాపూర్‌ రైల్వే స్టేషన్‌లో ఇటీవల కూలీ పనులకు కుదిరారు. గత 10 రోజులుగా వారు ఇక్కడే పనులు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర పోలీసులు, తాండూరు పోలీసుల సహాయంతో అపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున రుక్మాపూర్ రైల్వే హెడ్ క్వార్టర్‌లో దాడులు నిర్వహించారు. నలుగురు నక్సలైట్లను అదుపులోకి తీసుకొని మహారాష్ట్రకు తరలించారు. https://www.dharshininews.com/43262/