schedule Saturday, July 04, 2026

అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత

calendar_today May 13, 2026
person dharshininews
అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత
అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత - యాలాల పోలీస్టేషన్‌లో కేసు నమోదు - వివరాలు వెల్లడించిన ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను యాలాల పోలీసులు పట్టుకున్నారు. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అగ్గనూరు గ్రామ శివారు నుంచి ఇసుక రవాణా చేస్తున్నారని పోలీసులకు బుధవారం మధ్యాహ్నం సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్టర్(ఏపీ28 టీబీ 0738) అక్కడి నుంచి మండలంలోని జుంటుపల్లి వైపు వెళుతోంది. జుంటుపల్లి సమీపంలో ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. ఇసుక రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలు చూపించాలని కోరడంతో ఎలాంటి అనుమతులు లేవని తెలిసింది. దీంతో ట్రాక్టర్‌ను యాలాల పోలీస్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్ యజమాని అగ్గనూర్ గ్రామానికి చెందిన గోపికృష్ణకు చెందినగా గుర్తించామని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ విఠల్ రెడ్డి హెచ్చరించారు. https://www.dharshininews.com/43309/