schedule Saturday, July 04, 2026

యూపీ నిందితుడి కేసులో బిగ్ ట్విస్ట్..!

calendar_today May 16, 2026
person dharshininews
యూపీ నిందితుడి కేసులో బిగ్ ట్విస్ట్..!
యూపీ నిందితుడి కేసులో బిగ్ ట్విస్ట్..! - కిడ్నాప్‌ కేసుతో పాటు ఫోక్సో కేసు - తాండూరు న్యాయస్థానంలో హాజరు - రిమాండుకు తరలింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో మైనర్‌ బాలిక కిడ్నాప్‌ కేసులో నిందితుడి ఘటనలో బిగ్ ట్విస్ట్ ఏర్పడింది. నిందితుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈనెల 9న తాండూరు పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికను యూపీకి చెందిన అజీమ్ అనే యువకుడు కిడ్నాప్‌కు యత్నించిన సంగతి తెలిసిందే. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాలికతో పాటు నిందితుడు అజీమ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. పట్టణ పోలీస్టేషన్‌కు తరలించి నిందితుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. సరిగ్గా ఐదు రోజుల తరువాత ఈ కేసులోని నిందితుడు పోలీస్టేషన్‌ నుంచి పరారైనట్లు వదంతులు రావడం కలకలం రేపింది. దీనిపై పోలీసులు నిందితుడికి స్టేషన్ బేయిల్ ఇవ్వడం జరిగిందని, నిందితుడు పరారు కాలేదని పోలీసులు చెప్పారు. యూపీకి వెళ్లి పోయిన నిందితుడికి పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడుపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదుతో ఫోక్సో కేసును నమోదు చేశారు. హైడ్రామా మద్య పోలీసులు నిందితుడిని శనివారం తాండూరు న్యాయస్థానంలో హాజరు పరిచి రిమాండుకు తరలించారు. https://www.dharshininews.com/43332/