schedule Saturday, July 04, 2026

అక్రమంగా ఇసుక రవాణా

calendar_today May 22, 2026
person dharshininews
అక్రమంగా ఇసుక రవాణా
అక్రమంగా ఇసుక రవాణా - ట్రాక్టర్‌ను పట్టుకున్న పోలీసులు - వివరాలు వెల్లడించిన ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను యాలాల పోలీసులు పట్టుకున్నారు. యాలాల ఎస్ఐ ఎస్ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కోకట్ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ట్రాక్టర్ నెంబర్(KA32TD0822) ఎలాంటి నెంబర్‌ లేని ట్రాలీతో ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. అదేవిధంగా ఇసుక తరలింపుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో పోలీసులు ట్రాక్టర్‌ను సీజ్ చేసి యాలాల పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు ట్రాక్టర్ డ్రైవర్ వెంకట్ అనే వ్యక్తి పైన కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయని ఎస్ఐ విఠల్ రెడ్డి హెచ్చరించారు. https://www.dharshininews.com/43360/