schedule Sunday, September 06, 2026

కాంగ్రెస్ యువనేతకు బీఎస్‌ఆర్ పరామర్శ

calendar_today May 23, 2026
person dharshininews
కాంగ్రెస్ యువనేతకు బీఎస్‌ఆర్ పరామర్శ
కాంగ్రెస్ యువనేతకు బీఎస్‌ఆర్ పరామర్శ - ఇంటికి వెళ్లి పలకరించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ యువనేతను పరామర్శించారు. పార్టీకి చెందిన యువనేత జోషి వికాస్ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని వారి నివాసానికి చేరుకున్నారు. శనివారం ఈ విషయం తెలుసుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి రాత్రి వికాష్‌ జోషి ఇంటికి వెళ్లారు. శ్రీనివాస్ రెడ్డి వికాస్‌ను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మనోధైర్యం కోల్పోవద్దని, క్షేమంగా కోలుకోవాలని పరామర్శించారు. అవసరమైతే అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల ఉన్నారు. https://www.dharshininews.com/43367/