schedule Monday, September 07, 2026

ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఉండొద్దు

calendar_today May 28, 2026
person dharshininews
ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఉండొద్దు
ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఉండొద్దు - ఇతర స్టాక్ పాయింట్లకు చేరవేయాలి - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేసి.. రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం యాలాల మండలంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా ధాన్యం నిల్వలపై అధికారులతో, మిల్లర్లు, ట్రాన్స్‌ఫోర్ట్ వాళ్లతో ఫోన్లో మాట్లాడారు. కేంద్రాల నుంచి ధాన్యం తరలింపులో ఏమైనా సమస్యలు ఉన్నాయా..? ఆలస్యం ఎందుకు జరుగుతుందని ఆరా తీశారు. నియోజకవర్గంలో స్టాక్ పాయింట్స్ పూర్తిగా ధాన్యంతో భర్తీ అవ్వడంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నారని గుర్తించారు. ధాన్యం తరలింపులో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఓ స్టాక్ పాయింట్ భర్తి అయితే మిగిలిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో స్టాక్ పాయింట్స్ కు తరిలించే విధంగా పూర్తి ఏర్పాట్లు చేయాలని అన్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా నాయకులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ధాన్యం తరలింపు ప్రక్రియను ఎప్పటికప్పుడు చేపట్టేలా దృష్టిసారించాలని అన్నారు. https://www.dharshininews.com/43395/