schedule Saturday, July 04, 2026

పసి బాలుడిపై వీధి కుక్క వీరంగం

calendar_today May 28, 2026
person dharshininews
పసి బాలుడిపై వీధి కుక్క వీరంగం
పసి బాలుడిపై వీధి కుక్క వీరంగం - దాడిలో తల్లికి కూడా గాయాలు - బెంబేలెత్తి పోతున్న స్థానిక ప్రజలు - తాండూరు పట్టణం మల్‌రెడ్డిపల్లిలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆడుకుంటున్న పసిబాలుడిపై ఓ వీధి కుక్క వీరంగం చేసింది. బాలుడితో పాటు తల్లిపై కూడా ఎగబడి రక్కేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తాండూరు పట్టణం మల్‌రెడ్డిపల్లిలో భయాందోళనకు గురి చేసింది. బుధవారం రాత్రి మల్‌రెడ్డిపల్లిలోని 1వ వార్డులో నాలుగేళ్ల బాలుడితో పాటు తల్లిపై రోడ్లపై తిరిగే వీధి కుక్క విరుచుకుపడింది. ఒక్కసారిగా కుక్క దాడికి పాల్పడడంతో బాలుడు, తల్లి గాయాలపాలయ్యారు. ముఖ్యంగా బాలుడి మెడ వెనుక భాగంలో కుక్క రక్కేయడంతో బలమైన గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు కుక్కను తరిమి కొట్టి బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వార్డులో కుక్కల బెడద అధికమవడంతో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడద తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వార్డు కౌన్సిలర్ నాగలక్ష్మీ, స్థానికులు అధికారులను కోరుతున్నారు. https://www.dharshininews.com/43400/