schedule Saturday, July 04, 2026

పిడుగు పడే చోటు చెప్పేస్తుంది..!

calendar_today June 9, 2026
person dharshininews
పిడుగు పడే చోటు చెప్పేస్తుంది..!
పిడుగు పడే చోటు చెప్పేస్తుంది..! - ఎంతదూరంలో పడుతుందో చూపిస్తుంది - ఎలా అప్రమత్తం చేస్తుందో తెలుసా - అందుబాటులో ప్ర‌త్యేక యాప్‌ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : వ‌ర్షాకాలం మొదలవుతోంది. వర్షాలతో పాటు పిడుగులు పడి ప్రమాదాలు జరిగే సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని తలుచుకుంటేనే భయాందోళన చెందాల్సిందే. పిడుగు పడే చోటు ముందే తెలిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి పిడుగు ప్రమాదాలను గుర్తించే యాప్‌లను అందుబాటులో ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఈ యాప్‌ల ద్వారా పిడుగు ఎప్పుడు పడుతుంది.? ఎక్కడ పడుతుంది..? ఎంత దూరంలో పడుతుంది..? ఎలా అప్రమత్తం అవ్వాలనే విషయాలు ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడకం అందరికీ తెలిసిందే. పోన్లలో దామిని యాప్ వాడడం వల్ల పిడుగుపడే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి అప్రమత్తం చేస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంత‌లు తొక్కిన త‌రువాత కొత్త కొత్త యాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. పిడుగుల రాకను గుర్తించి అప్రమత్తం చేసేది దామిని యాప్‌. ఈ యాప్‌ను పుణెలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరియాలజీ రూపొందించింది. ఈ యాప్‌ ఉపయోగించడం ద్వారా పిడుగుల సమాచారం క్షణాల్లో తెలుసుకోవచ్చు. 20 నుంచి 40 కిలో మీటర్ల పరిధిలో పిడుగులు పడే అవకాశం ఉంటే ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. మీతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లు నమోదు చేస్తే సందేశం వారికి కూడా చేరుతుంది. తద్వారా వెంటనే అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు చేరుకుని ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. అప్రమత్తం చేసే రంగులు నీలం : మరో 21 నిమిషాల్లో పిడుగు పడుతుందని అంచనా. పసుపు : రాబోయే 14 నిమిషాల్లో పిడుగు పడే అవకాశాన్ని సూచిస్తుంది. ఎరుపు : ఇంకో 7 నిమిషాల్లో పిడుగు పడుతుందని హెచ్చరికగా భావించాలి. https://www.dharshininews.com/43482/