schedule Sunday, September 06, 2026

కాలనీలపై కనువిప్పు కలిగెదెప్పుడు..?

calendar_today June 10, 2026
person dharshininews
కాలనీలపై కనువిప్పు కలిగెదెప్పుడు..?
కాలనీలపై కనువిప్పు కలిగెదెప్పుడు..? - మూడేళ్లయినా రోడ్లు వేయని ప్రభుత్వం - మాటలకే పరిమితమైన ఎమ్మెల్యే - సొంత ఖర్చులతో రోడ్లపై గుంతల పూడిక - రాజీవ్‌ కాలనీ కౌన్సిలర్ జావిద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ గృహ కల్ప, ఇందిరమ్మ కాలనీల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు ఎప్పుడు కలుగుతుందో అంటూ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ జావిద్ ఆవేధన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలలోని రోడ్లు గుంతల మయంగా మారాయి. గుంతల్లో వర్షపు నీరు నిండి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బుధవారం వార్డు కౌన్సిలర్ జావిద్ కాలనీ వాసులతో కలిసి సొంత ఖర్చులతో నాపరాతి వ్యర్థాలు తెప్పించి గుంతలను పూడ్చివేత కార్యక్రమాలను చేపట్టారు. రోడ్లపై గుంతలను వ్యర్థాలతో మూయించి వేశారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ జావిద్ మాట్లాడుతూ రాజీవ్, ఇందిరమ్మ కాలనీల అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అన్నారు. కాలనీలో రోడ్ల అభివృద్ధి పనులు మంజూరయ్యాయని చెబుతున్నారే తప్పా మూడేళ్లయినా పనులు ప్రారంభించడం లేదని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే కేవలం మాటలకే పరిమితం అయ్యారని విమర్శించారు. డబుల్‌ బెడ్‌ రూంలను పారదర్శకంగా పంపిణీ చేస్తామని గొప్పలు చెబుతున్నారని, అక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. ఇప్పటికైనా కాలనీలలో అభివృద్ధి పనులు చేపట్టకపోతే ఎంతటి ఆందోళనకైనా సిద్దమని హెచ్చరించారు. https://www.dharshininews.com/43494/