schedule Thursday, September 03, 2026

మహోన్నతుడు అంబేద్కర్

calendar_today December 6, 2021
person dharshininews
మహోన్నతుడు అంబేద్కర్
మహోన్నతుడు అంబేద్కర్ - వర్ధంతిలో నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత దేశ ప్రజాస్వామ్య స్పూర్తిని విశ్వవ్యాప్తం చేసిన డా. బీఆర్ అంబేద్కర్ మహోన్నతుడని తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. సోమవారం అంబేద్కర్ 65వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాతో పాటు పాత తాండూరు అంబేద్కర్ పార్కులో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. భారత రాజ్యాంగాన్ని రచించి అందరికి స్వేచ్ఛ, హక్కులను కల్పించారని అన్నారు. ఆయన కృషి చేసిన కృషిని ప్రపంచ దేశాలే మెచ్చుకున్నాయని అన్నారు. బడుగు బల హీనవర్గాల అభ్యున్నతికి పాటుపడిన అంబేద్కర్ను అందరు గుర్తుంచుకోవాలన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, ఎస్సీ సెల్, మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు.