schedule Thursday, September 03, 2026

తాండూరులో కల్తీ కోవా కలకలం..!

calendar_today August 18, 2026
person dharshininews
తాండూరులో కల్తీ కోవా కలకలం..!
తాండూరులో కల్తీ కోవా కలకలం..! - రూ.30 వేల విలువైన కల్తీ కోవా, కళాఖాన్‌ స్వాధీనం - జహీరాబాద్‌ నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠా - టాస్క్‌ఫోర్స్‌ దాడితో వెలుగులోకి వ్యవహారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో కల్తీ కోవా వ్యవహారం కలకలం రేపింది. జహీరాబాద్‌ నుంచి తాండూరుకు కల్తీ కోవా, కళాఖాన్‌ను తరలించి విక్రయిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో మంగళవారం దాడి చేసి రూ.30 వేల విలువైన కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో 160 కిలోల కల్తీ కోవా, 14 కిలోల కల్తీ కళాఖాన్‌ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రూపారామ్‌ను అదుపులోకి తీసుకుని తాండూరు పట్టణ పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న కల్తీ పదార్థాలను సీజ్‌ చేశారు. కల్తీ పదార్థాల సరఫరా, విక్రయానికి సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ ఆహార పదార్థాల విక్రయాలను ఏమాత్రం ఉపేక్షించబోమని.. కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు పోలీసులకు సహాకారం అందించాలని టాస్క్ ఫోర్స్‌ పోలీసులు కోరారు. https://www.dharshininews.com/44259/