schedule Thursday, September 03, 2026

అపదలో ఇక 112నే అండ..!

calendar_today August 19, 2026
person dharshininews
అపదలో ఇక 112నే అండ..!
అపదలో ఇక 112నే అండ..! - ఒక్క కాల్‌తోనే 18 రకాల సేవలు - అత్యవసరంలో ఉపయోగం ఖాయం - ఏమేం సేవలు అందుతాయో తెలుసుకోండి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : అపద ఏ రూపంలో వచ్చినా.. ఇక గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్క నంబరే.. అదే 112. పోలీస్‌ సాయం కావాలా? అగ్నిప్రమాదమా? అంబులెన్స్‌ అవసరమా? అత్యవసర పరిస్థితి ఏదైనా ఒకే నంబర్‌కు కాల్‌ చేస్తే చాలు. తెలంగాణలో అత్యవసర సేవలను మరింత వేగవంతం చేసేలా డయల్‌ 100 స్థానంలో 112ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు పోలీస్‌ సేవలకు 100, ఫైర్‌ సేవలకు 101, అంబులెన్స్‌కు 108 వంటి వేర్వేరు నంబర్లు ఉండేవి. ఇక నుంచి ఆయా నంబర్లను వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా112 ద్వారా పోలీస్‌, అగ్నిమాపక, వైద్య అత్యవసర సేవలను పొందే అవకాశం కల్పించారు. 112కు వచ్చే కాల్స్‌ను కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలోని సిబ్బంది స్వీకరిస్తారు. సమాచారం ఆధారంగా సమీపంలోని పోలీస్‌, అగ్నిమాపక, వైద్య సిబ్బందికి వివరాలు చేరవేసి సత్వర స్పందనకు చర్యలు తీసుకుంటారు. ఒక్క కాల్‌.. 18 రకాల సేవలు సేవలు పోలీస్‌, ఫైర్‌, అంబులెన్స్‌ సేవలకే పరిమితం కాకుండా 18 రకాల అత్యవసర సేవలకు 112ను వినియోగించుకునేలా వ్యవస్థను రూపొందించారు. ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, నేరాలు, మహిళలు, పిల్లల భద్రతకు సంబంధించిన అత్యవసర పరిస్థితులు తదితర సందర్భాల్లో ఈ నంబర్‌కు సంప్రదించవచ్చు. 1. పోలీస్‌ సేవలు – శాంతిభద్రతలు, అత్యవసర పోలీస్‌ సహాయం 2. వైద్య సేవలు – అంబులెన్స్‌, అత్యవసర వైద్య సహాయం 3. అగ్నిమాపక సేవలు – అగ్ని ప్రమాదాల్లో ఫైర్‌ సాయం 4. మహిళల భద్రత – ఆపదలో మహిళలకు ప్రత్యేక రక్షణ 5. సైబర్‌ మోసం – సైబర్‌ మోసాలు, ఆన్‌లైన్‌ వేధింపులపై సహాయం 6. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ – పిల్లలకు సంబంధించిన అత్యవసర రక్షణ 7. విపత్తు నిర్వహణ – ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల్లో సహాయం 8. విద్యుత్‌ శాఖ – విద్యుత్‌ ప్రమాదాలు లేదా అత్యవసర విద్యుత్‌ సమస్యలు 9. జీహెచ్‌ఎంసీ/మున్సిపల్‌ సేవలు – నగరపాలక సంస్థ పరిధిలో అత్యవసర సమస్యలు 10. హైవే సేవలు – హైవేపై ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం 11. ఎన్‌హెచ్‌ఏఐ సేవలు – జాతీయ రహదారులపై అత్యవసర సహాయం 12. న్యాయ సహాయం – తక్షణ న్యాయ సంబంధిత సహాయం 13. మిస్సింగ్‌ కేసులు – తప్పిపోయిన లేదా ఎత్తుకుపోయిన వ్యక్తుల కోసం సహాయం 14. రైల్వే సేవలు – రైలు ప్రయాణంలో అత్యవసర సహాయం 15. సీనియర్‌ సిటిజన్‌ సేవలు – వృద్ధులకు ఆపద సమయంలో సహాయం 16. టూరిస్టుల సేవలు – పర్యాటక కేంద్రాల్లో లేదా ప్రయాణంలో ఇబ్బందులపై సహాయం 17. ఆర్గన్‌ డొనేషన్‌ – అత్యవసర అవయవ దానానికి సంబంధించిన సమన్వయం 18. గ్యాస్‌ లీక్‌ సేవలు – ఇళ్లలో గ్యాస్‌ లీకేజీ వంటి ప్రమాదాల్లో సహాయం https://www.dharshininews.com/44265/