schedule Thursday, September 03, 2026

ముగ్గురు అనుమానితుల వద్ద గంజాయి

calendar_today August 20, 2026
person dharshininews
ముగ్గురు అనుమానితుల వద్ద గంజాయి
ముగ్గురు అనుమానితుల వద్ద గంజాయి - తాండూరులో 1260 గ్రాములు స్వాధీనం - నిందితులపై ఎన్డీపీఎస్‌ యాక్టు కింద కేసు తాండూరు, దర్శిని ప్రతినిధి : బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తుల వద్ద పోలీసులు గంజాయిని గుర్తించారు. ఈ సంఘటన గురువారం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్, తాండూరు పోలీసులు అక్రమ రవాణా, కల్తీ, గంజాయి రవాణాపై నిఘా ఉంచారు. ఇందులో భాగంగా గురువారం టాస్క్ ఫోర్స్‌ సీఐ అన్వర్ పాష, తాండూరు పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని విలియమూన్ స్కూల్ వద్ద ముగ్గురు అనుమానితులను గుర్తించారు. వారిని తనిఖీ చేయగా బ్యాగుల్లో 1260 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని స్వాదీనం చేసుకుని ముగ్గురు నిందితులపై ఎన్డీపీఎస్ యాక్టు కింద కేసు నమోదు చేసి.. రిమాండుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వాటికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. https://www.dharshininews.com/44294/