schedule Thursday, September 03, 2026

మహిళ గొంతుపై దాడి..!

calendar_today August 29, 2026
person dharshininews
మహిళ గొంతుపై దాడి..!
మహిళ గొంతుపై దాడి..! - మెడలో నల్లపూసలు, పుస్తెలతాడు అపహరణ - ఇంటి మాజీ పనిమనిషి భర్త ఘాతుకం - తాండూరులో పట్టపగలే కలకలం  తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఆ ఇంటి మాజీ పని మనిషి భర్త దాడికి పాల్పడ్డాడు. మెడలో నల్లపూసలు, పుస్తెల తాడు అపహరించుకొని పారిపోయాడు. శనివారం తాండూరు పట్టణంలో పట్టపగలే జరిగిన ఘటన కలకలం రేపింది. తాండూరు పట్టణంలోని బసవేశ్వర నగర్‌ ku చెందిన ఉమాదేవి సుభాన్‌రెడ్డి ఇంట్లో గతంలో బుజ్జమ్మ అనే మహిళ ఇంటి పనులు చేసేది. కొంతకాలంగా ఆమె పని మానేసింది. ఈ క్రమంలో బుజ్జమ్మ భర్త మొగులప్ప శనివారం ఉమాదేవి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న ఉమాదేవిపై అకస్మాత్తుగా దాడికి పాల్పడి.. ఆమె మెడలో ఉన్న నల్లపూసల దండ, పుస్తెలతాడును లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.  క్రమంలో ఉమాదేవి మెడపై గాయాలయ్యాయి. ఉమాదేవి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసుల రంగప్రవేశం ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. https://www.dharshininews.com/44430/