schedule Thursday, September 03, 2026

ఉచిత కోచింగ్‌కు సూపర్ ఛాన్స్!

calendar_today August 29, 2026
person dharshininews
ఉచిత కోచింగ్‌కు సూపర్ ఛాన్స్!
ఉచిత కోచింగ్‌కు సూపర్ ఛాన్స్! - ఎస్ఐ, కానిస్టేబుల్‌, పోటీ పరీక్షలకు శిక్షణ - యువత రిజిస్ట్రేషన్ తో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి - పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగరాజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తాండూరు ప్రాంత యువతకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ తరగతులు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజ్ తెలిపారు. పోలీసుశాఖలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉచిత కోచింగ్‌కు హాజరు కావాలనుకునే అభ్యర్థుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఆగస్టు 31 తేదీ వరకు తాండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసిన పత్రాలు, ఆధార్ కార్డు, ఇంటర్, డిగ్రీ మెమోల జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తాండూరు ప్రాంత యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగ సాధన దిశగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. https://www.dharshininews.com/44433/