schedule Sunday, September 20, 2026

దసరా సెలవుల షెడ్యూల్‌..!

calendar_today September 20, 2026
person dharshininews
దసరా సెలవుల షెడ్యూల్‌..!
దసరా సెలవుల షెడ్యూల్‌..! - ప్రకటించిన ప్రభుత్వం - ఈ సారి ఎన్నిరోజులంటే..? హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : దసరా పండుగ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పాఠశాలలకు దసరా సెలవుల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఈసారి వరుసగా 13 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు రానున్నాయి. అక్టోబర్‌ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు కొనసాగనున్నాయి. దీంతో అక్టోబర్‌ 9 పాఠశాలలకు చివరి పనిదినంగా ఉండనుంది. సెలవులు ముగిసిన అనంతరం **అక్టోబర్‌ 23 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. బతుకమ్మతో కలిసి దసరా సందడి తెలంగాణలో దసరాతో పాటు బతుకమ్మ పండుగ కూడా ఇదే సమయంలో రావడంతో విద్యార్థులకు సుదీర్ఘ సెలవులు లభిస్తున్నాయి. దీంతో పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు, సొంతూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులకు అవకాశం దక్కనుంది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు విద్యాశాఖ ప్రకటించిన ఈ సెలవుల షెడ్యూల్‌ వర్తించనుంది. దీంతో పండుగ సెలవులపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది. దసరా సెలవులు: అక్టోబర్‌ 10–22 చివరి పనిదినం: అక్టోబర్‌ 9 పాఠశాలలు పునఃప్రారంభం: అక్టోబర్‌ 23 మొత్తం సెలవులు: 13 రోజులు https://www.dharshininews.com/44794/