తాండూరులో వీధి కుక్కల పట్టివేత..!
October 28, 2026
dharshininews
తాండూరులో వీధి కుక్కల పట్టివేత..!
- బ్లూ క్రాస్ ఆధ్వర్యంలో చర్యలు
- ప్రజా సంరక్షణపై దృష్టి
- చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టణంలో వీధి కుక్కల సమస్యను నియంత్రించడంతో పాటు ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ తాండూరు మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల పట్టివేత కార్యక్రమాన్ని చేపట్టారు.
బ్లూ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో సాయిపూర్, మాణిక్ నగర్, పాత కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టుకున్న కుక్కలకు జంతు జనన నియంత్రణ శస్త్రచికిత్స (ఏబీసీ) నిర్వహించి, ఐదు రోజుల పాటు పరిశీలనలో ఉంచుతారు. ఆరో రోజు వాటిని ఏ ప్రాంతంలో పట్టుకున్నారో తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెడతారు.
అనంతరం ఇతర ప్రాంతాల్లోనూ ఇదే విధానంలో కుక్కల పట్టివేత, శస్త్రచికిత్స, పరిశీలన ప్రక్రియ కొనసాగిస్తారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వీధి కుక్కల జనాభా నియంత్రణతో పాటు పట్టణ ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, బ్లూ క్రాస్ ప్రతినిధి, వార్డు కౌన్సిలర్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, ఎస్సై, వార్డు జవాన్లు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45211/