schedule Wednesday, November 04, 2026

నిరుద్యోగ యువతకు బీఎంఆర్‌ ఫౌండేషన్‌ తోడ్పాటు..!

calendar_today October 29, 2026
person dharshininews
నిరుద్యోగ యువతకు బీఎంఆర్‌ ఫౌండేషన్‌ తోడ్పాటు..!
నిరుద్యోగ యువతకు బీఎంఆర్‌ ఫౌండేషన్‌ తోడ్పాటు..! - తాండూరు గ్రంథాలయానికి ఉచిత స్టడీ మెటీరియల్‌ అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు బీఎంఆర్‌ ఫౌండేషన్‌ మరో తోడ్పాటు అందించింది. గురువారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో తాండూరు పట్టణంలోని గ్రంథాలయంలో అభ్యర్థుల కోసం ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమాల్లో ఉచిత స్టడీ మెటీరియల్‌ను ఫౌండేషన్‌ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఇప్పటికే బీఎంఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గ్రంథాలయంలో అందుబాటులో ఉంచిన స్టడీ మెటీరియల్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని, పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త పర్యాద రామకృష్ణ, పలువురు యువకులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45224/