schedule Wednesday, November 04, 2026

చెత్త కుప్పకు మోక్షం..!

calendar_today October 30, 2026
person dharshininews
చెత్త కుప్పకు మోక్షం..!
చెత్త కుప్పకు మోక్షం..! - 20వ వార్డులో శుభ్రత పనులు - ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లకు కృతజ్ఞతలు - కాంగ్రెస్ యువ నాయకులు బిడ్కర్ రఘు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని 20వ వార్డు గాంధీనగర్‌ సమీపంలో కొన్ని నెలలుగా పేరుకుపోయిన చెత్త కుప్ప సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఇటీవల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ తాండూరు కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు చెత్త కుప్ప సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం కాంగ్రెస్‌ యువ నాయకుడు బిడ్కర్‌ రఘు ఆధ్వర్యంలో చెత్త కుప్పను తొలగించడంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుభ్రత పనులు చేపట్టారు. దీంతో నెలల తరబడి చెత్త సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులకు ఉపశమనం లభించింది. సమస్య పరిష్కారానికి సహకరించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డికి బిడ్కర్‌ రఘు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారంతో 20వ వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. https://www.dharshininews.com/45226/