schedule Saturday, September 05, 2026

ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు

calendar_today December 23, 2021
person dharshininews
ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు
రైతన్నకు సమాజంలో సముచిత స్థానం దక్కాలి - ప్రతిభ హై స్కూల్లో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంలోని కోడంగ‌ల్ రోడ్డుమార్గంలో ఉన్న ప్ర‌తిభ హైస్కూల్‌లో జాతీయ రైతు దినోత్సవం ఘ‌నంగా జ‌రుపుకున్నారు. గురువారం రైతు దినోత్స‌వాన్ని పురస్కరించుకొని పాఠ‌శాల విద్యార్థులు రైతుల వేషధారణలో విద్యార్థులు రైతుల కష్టాన్నీ వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని వివ‌రించే ప్ర‌ద‌ర్శ‌న ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. విద్యార్థులు త‌మ విన‌యాలతో అందరిని ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా పాఠశాల యాజమాన్య సభ్యులు పర్యాద రామకృష్ణ, నిర్ణి చంద్ర‌శేఖ‌ర్‌లు మాట్లాడుతూ భార‌త‌ మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవమే జాతీయ రైతు దినోత్సవం అన్నారు. దేశంలో రైతుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. అదేవిధంగా రైతాంగానికి మంచి రోజులు రావాలి, స‌మాజంలో రైతుల‌కు స‌ముచిత స్థానం ద‌క్కాల‌న్నారు. విద్యార్థులు కూడా భవిష్యత్తులో రైతాంగాన్ని వృత్తిగా ఎంచుకొని వ్యవసాయంలో భారత్ ను అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ నరేష్ కుమార్, ప్రిన్సిపాల్ రవికుమార్, ఉపాధ్యాయులు మధు, వీరేశం, గఫార్, రేణుక, సంతోషా, స్నేహ, శ్రద్ద, సంధ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.