schedule Saturday, July 11, 2026

సేవా మూర్తి రొంప‌ల్లి సంతోష్ కుమార్

calendar_today January 19, 2022
person dharshininews
సేవా మూర్తి రొంప‌ల్లి సంతోష్ కుమార్
సేవా మూర్తి రొంప‌ల్లి సంతోష్ కుమార్ - జ‌న్మ‌దినం రోజున పేద‌ల‌కు సేవా కార్య‌క్ర‌మాలు - దుప్ప‌ట్లు, నిత్య‌వ‌స‌ర సరుకులు, అల్ప‌హారం పంపిణీ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: నిరుపేద‌ల‌కు త‌న‌వంతు స‌హాయం అందించిన తాండూరు టీఆర్ఎస్ యువ‌నాయ‌కులు, ఇంట‌ర్నేష‌న‌ల్ వైశ్య ఫెడ‌రేష‌న్ జిల్లా అధ్య‌క్షులు రొంప‌ల్లి సంతోష్ కుమార్‌ను ప్ర‌జ‌లు సేవామూర్తి అంటూ కొనియాడారు. మంగ‌ళ‌వారం రొంప‌ల్లి సంతోష్ కుమార్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని వైశ్య ఫెడ‌రేష‌న్‌తో పాటు వివిధ సంఘాల‌తో క‌లిసి ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు. మున్సిప‌ల్ ప‌రిధిలోని 6వ వార్డులో పేద‌ల‌కు దుప్ప‌ట్ల‌ను పంపిణీ చేశారు. అదేవిధంగా ప‌లువురుకి నిత్య‌వ‌స‌ర స‌రుకుల‌ను పంపిణీ చేశారు. జిల్లా ఆసుప‌త్రి, మాతా శిశు ఆసుప‌త్రిలో రోగుల‌కు, బందువుల‌కు అల్ప‌హారం పంపిణీ చేశారు. దీంతో పాటు త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మొక్క‌లు నాటి నీళ్లు పోశారు. మ‌రోవైపు రొంప‌ల్లి సంతోష్ కుమార్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తాండూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌లువురు రాజ‌కీయ‌, స్వ‌చ్ఛంద సంఘాల నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు. రొంప‌ల్లి సంతోష్ కుమార్‌ను శాలువా, పూల మాల‌ల‌తో స‌న్మానించారు. రొంప‌ల్లి సంతోష్ కుమార్ రోజంతా సేవా కార్య‌క్ర‌మాలతో జ‌న్మ‌దినాన్ని అట్ట‌హాసంగా జ‌రుపుకున్నారు. ఈ కార్య‌క్ర‌మాల్లో ఆత్మీయ సేవా స‌మితి స‌భ్యులు అస‌ద్, సుబ్బారావు, ప్ర‌సాద్, వెంక‌టేశం, మ‌ల్లారెడ్డి, పెద్దేముల్ స‌హాకార సంఘం చైర్మ‌న్ ద్యావ‌రి విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి, వైశ్య ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షులు గౌరీ శంక‌ర్, కార్య‌ద‌ర్శి వెంక‌ట్ దాసు, కోశాధికారి స‌తీష్‌, వాస‌వి క్ల‌బ్ అధ్య‌క్షులు క‌ల్వ వంశి, కార్య‌ద‌ర్శి శ్రావ‌ణ్, కోశాధికారి శ్రీ‌కాంత్, ల‌య‌న్స్ క్ల‌బ్ అధ్య‌క్షులు జ‌య‌శ్రీ దివాటే, కార్య‌ద‌ర్శి ఎడ్రామి బ‌స‌న‌ప్ప, స్నేహితులు, ఆత్మీయులు, బందువులు త‌దిత‌రులు పాల్గొన్నారు.