schedule Saturday, September 05, 2026

ముగిసిన మొహ‌ర్రం

calendar_today August 20, 2021
person dharshininews
ముగిసిన మొహ‌ర్రం
ముగిసిన మొహ‌ర్రం - ఘ‌నంగా పీర్ల నిమ‌జ్జ‌నం తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరులో మొహ‌ర్రం వేడుక‌లు ముగిశాయి. గ‌త ప‌దిరోజుల పాటు మ‌సీదుల్లో ప్ర‌తిష్టించిన పీర్ల‌ను శుక్ర‌వారం రాత్రి నిమ‌జ్జ‌నం చేశారు. తాండూరు ప‌ట్ట‌ణంలోని ఇందిరాన‌గ‌ర్, మ‌ల్‌రెడ్డిప‌ల్లి, సాయిపూర్, పాత తాండూరులో మొహ‌ర్రం ముగింపు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆయీ ప్రాంతాల్లోని మ‌సీదుల్లో ప్ర‌తిష్టించిన పీర్ల‌కు చివ‌రి రోజు భ‌క్తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఇందిరాన‌గ‌ర‌లో జ‌రిగిన మొహ‌ర్రం వేడుక‌లో పాల్గొన్న నేత‌ల‌ను వార్డు నాయ‌కులు ఘ‌నంగా స‌న్మానించారు. అనంత‌రం పీర్ల ఊరేగింపు నిర్వ‌హించి ష‌హ‌ద‌త్ పేరుతో నిమ‌జ్జ‌నం చేసి మొహ‌ర్రం వేడుకల‌ను ముగించారు.