schedule Monday, September 07, 2026

గాంధీనగర్‌లో ఫీవర్ సర్వే పూర్తి

calendar_today January 24, 2022
person dharshininews
గాంధీనగర్‌లో ఫీవర్ సర్వే పూర్తి
గాంధీనగర్‌లో ఫీవర్ సర్వే పూర్తి - కృతజ్ఞతలు తెలిపిన కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ లో ఫీవర్ సర్వే పూర్తయినట్లు వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్సంగ్ ఠాకూర్ తెలిపారు. కరోనా నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టిన మూడు రోజుల పాటు ప్రత్యేక బృందాలు ఇంటింటికి తిరిగి పూర్తి చేశారని అన్నారు. వార్డులో మొత్తం 480 ఇండ్లలో సర్వే చేపట్టి జలుబు, జ్వరం, దగ్గుతో పాటు కోవిడ్ లక్షణాలు ఉన్న వారి వివరాలను సేకరించారని చెప్పారు. ఈ సర్వేలో ఎవ్వరికి కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు తేలలేదని స్పష్టం చేశారు. జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా నేగిటివ్ వచ్చిందని వివరించారు. వార్డులో పూర్తి చేసిన సర్వేను తాండూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ కు అందజేశారు. వార్డులో ఫీవర్ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయడం పట్ల వైద్య బృందాలు, సహకరించిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మహేష్, ఆర్పీ శోభ, అంగన్వాడి టీచర్ రాధా, ఆశా వర్కర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.