దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోండి
February 23, 2022
dharshininews
దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోండి
- వందశాతం సబ్సిడీతో ఐదు రకాల పరికాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: దివ్యాంగులకు ప్రభుత్వం సబ్సిడీ కింద ఐదు రకాల పరికాలను పంపిణీ చేస్తుంది. ఇందుకోసం అర్హులైన లబ్దిదారుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈనెల చివరి వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించింది. అసరాతో దివ్యాంగులకు అండగా నిలిచిన ప్రభుత్వం ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడాది కూడ వందశాతం సబ్సిడీ కింద ఉపకరమైన పరికరాలను అందించనుంది. చిన్నారుల నుంచి వృద్దుల వరకు ఈ పరికాలను అందజేస్తుంది. వినికిడి లోపం ఉన్న వారికి వినికిడి యంత్రాలు, రెట్రోఫిటెడ్ మోటార్ వెహికిల్, బ్యాటరీ వీల్‌చైర్, 4జీ స్మార్ట్ ఫోన్లు, లాప్ టాఫ్, డైసీ ప్లే ఉపకరాలను అందిస్తుంది. అర్హులైన వికలాంగుల నుంచి www.tsobmmms.cgg.gov.in పోర్టల్ ద్వారా శిశు, దివ్యాంగ, వయోవృద్దుల శాఖ దరఖాస్తులను కోరుతుంది. ఈనెల 28వ తేదిపు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.