schedule Saturday, July 11, 2026

తాండూరు రూరల్ సీఐగా రాంబాబు

calendar_today March 21, 2022
person dharshininews
తాండూరు రూరల్ సీఐగా రాంబాబు
తాండూరు రూరల్ సీఐగా రాంబాబు - చార్జ్ అప్ప‌గించిన సీఐ జ‌లంధ‌ర్ రెడ్డి తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు రూరల్ సీఐగా రాంబాబు బాధ్యతల స్వీకరించారు. ఇక్కడ సీఐగా పనిచేస్తున్న జలంధర్ రెడ్డి ఇటీవ‌లే బ‌దిలీ అయ్యారు. ఆయ‌న‌ను సంగారెడ్డి జిల్లా శ్రీ సీఆర్బీకి బదిలీ చేయగా అక్కడ పనిచేస్తున్న రాంబాబును తాండూరు రూరల్ సీఐగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం తాండూరు రూరల్ సీఐ కార్యాలయంలో బ‌దిలీపై వెళుతున్న సీఐ జ‌లంధ‌ర్ రెడ్డి నూత‌న సీఐగా వ‌చ్చిన రాంబాబుకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో రూర‌ల్ సీఐగా రాంబాబు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సందర్భంగా నూతన సీఐ రాంబాబు మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.