schedule Saturday, July 04, 2026

బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయం

calendar_today March 26, 2022
person dharshininews
బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయం
బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయం - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చడం అభినందనీయమని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శనివారం తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా ఆసుపత్రి వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో పట్టణ వాసుల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయ‌మన్నారు. సామాజిక సేవా దృక్పథంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటసారులకు తాగునీటి ఇబ్బందులు తీర్చడం ఆద‌ర్శ‌మ‌న్నారు. ఈ చలివేంద్రాలకు నీటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ నుంచి సహాకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాబర్, ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, సభ్యులు ఖుర్షిద్ హుస్సేన్, షల్లో తదితరులు పాల్గొన్నారు.