schedule Thursday, September 03, 2026

యాదాద్రి మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ‌లో ఎమ్మెల్యే

calendar_today March 28, 2022
person dharshininews
యాదాద్రి మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ‌లో ఎమ్మెల్యే
యాదాద్రి మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ‌లో ఎమ్మెల్యే - ప్ర‌త్యేక పూజ‌లు చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. సోమ‌వారం దేవాల‌యంలో నిర్వహించిన మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో వెల‌సిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేతో పాటు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి, ఎమ్మెల్యే త‌ల్లి వికారాబాద్ జెడ్పీటీసీ శ్రీమతి ప్రమోదిని రెడ్డిలు ఉన్నారు.