రైల్వే ఓవర్ బ్రిడ్జి..వచ్చేస్తోంది..!
April 14, 2022
dharshininews
రైల్వే ఓవర్ బ్రిడ్జి..వచ్చేస్తోంది..!
- రూ.74 కోట్ల ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ అనుమతులు
- అర్బన్ హెల్త్ సెంటర్ తో పాటు, కమ్యూనిటీ హాల్
- తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో ప్రతిష్టాత్మకంగా చేపట్టే రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పాత తాండూరుకు రైల్వో ఓవర్ బ్రిడ్జి వచ్చేస్తోందని, ఇందుకు ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు. గురువారం అంబేద్కర్ 131వ జయంతి వేడుకల్లో భాగంగా పాత తాండూరు అంబేద్కర్ పార్కులో నిర్వహించిన జయంతిలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికపై రోహిత్ రెడ్డి రైల్వే ఓవర్ బ్రిడ్జి గురించి కీలక విషయాలను వెల్లడించారు. ఎన్నో ఏండ్లుగా పాత తాండూరు వాసులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం రూ.74 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిందని పేర్కొన్నారు. దీంతో పాత తాండూరులోని రైల్వే ఓవర్ బ్రిడ్జికి రాజయోగం వచ్చింది. మరోవైపు పాత తాండూరులో అర్బన్ హెల్త్ సెంటర్ తోపాటు కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.