schedule Saturday, July 04, 2026

అధికారా.. అధికార పార్టీకి తొత్తా..?

calendar_today April 23, 2022
person dharshininews
అధికారా.. అధికార పార్టీకి తొత్తా..?
అధికారా.. అధికార పార్టీకి తొత్తా..? - పెద్దేముల్ ఎమ్మార్వోపై మండిపాటు - చెక్కుల పంపిణీలో ఇష్టారాజ్యం - త‌హ‌సీల్దార్‌పై జిల్లా క‌లెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం - పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్‌ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: పెద్దేముల్ మండ‌ల త‌హ‌సీల్దార్ హోదాలో ఉన్న అధికారి అధికార పార్టీకి తొత్తుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని జెడ్పీటీసీ ధారాసింద్, కాంగ్రెస్ నాయ‌కులు సంచల‌న విమ‌ర్శ‌లు చేశారు. శ‌నివారం వారు విలేక‌రుల‌తో మాట్లాడుతూ పెద్దేముల్ మండ‌ల త‌హ‌సీల్దార్ ఫ‌హీం ఖాద్రి ఇష్టారాజ్యంగా, టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా న‌డుచుకుంటున్నార‌ని ఆరోపించారు. మండ‌లానికి సంబంధించి ల‌బ్దిదారుల‌కు క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీ ముభార‌క్ చెక్కులు పంపీణీని తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసినట్లు త‌న‌తో పాటు ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు స‌మాచారం అందించార‌ని పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్ చెప్పుకొచ్చారు. మ‌ళ్లీ త‌హ‌సీల్దార్ ఎమ్మెల్యే అందుబాటులో లేర‌ని చెప్ప‌డంతో కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేసుకోవాల‌ని సూచించిన‌ట్లు తెలిపారు. అయినా కూడ త‌హ‌సీల్దార్ ఏక‌ప‌క్షంగా ఎలాంటి ప్రోటో కాల్ పాటించ‌కుండా చెక్కుల‌ను పంపిణీ చేశారని ఆరోపించారు. దీనిపై ఫోన్ చేసినా స్పందించ‌లేద‌ని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యేకు తొత్తుగా మారి ఇలాంటి ఇష్టారాజ్యంగా ప‌నులు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అలాంటి ఉద్దేశం ఉంటే ప‌ద‌వికి రిజైన్ చేసి కండువా వేసుకుని రాజ‌కీయం చేసుకోవాల‌న్నారు. అదేవిధంగా త‌హ‌సీల్దార్ ఫ‌హీం ఖాద్రి మండ‌లంలో అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. రియ‌ల్ మాఫీయా బ్రోక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు. త‌హ‌సీల్దార్ ఇష్టారాజ్యం, అవినీతిపై తాండూరు ఆర్డీఓ, జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేస్తామ‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీటీసీ శంక‌ర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల ప్రవీణ్ కుమార్, సీనియర్ నేత న్యాయవాది ఎల్లారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.