ధూపదీప నైవేద్య పథకంకు రెండు రోజులే గడువు
April 25, 2022
dharshininews
ధూపదీప నైవేద్య పథకంకు రెండు రోజులే గడువు
- ఈనెల 27 వరకు దరఖాస్తుకు చాన్స్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: అర్హతగల ఆయాల్లో ధూపదీప నైవేద్య పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ధూపదీప నైవేద్యాలకు రూ. 2000, అర్చకుని గౌర భృతి కింద రూ. 4000 చొప్పున దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ప్రభుత్వం చెల్లిస్తుంది. ధూపదీప నైవేద్య పథకానికిగాను దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27తో గడువు ముగుస్తున్నది. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ అర్హతగల ఆలయాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. వివరాలకు, దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకునేందుకు www.endowments.ts.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.