schedule Monday, September 07, 2026

క్షయ వ్యాధి పట్ల అప్రమత్తత అవసరం

calendar_today June 6, 2022
person dharshininews
క్షయ వ్యాధి పట్ల అప్రమత్తత అవసరం
క్షయ వ్యాధి పట్ల అప్రమత్తత అవసరం - బీజేపీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: క్షయ వ్యాధిపట్ల అందరు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధి గాంధీ నగ‌ర్‌లో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ కరో నా వైరస్ వల్ల ఎంతో మంది ఊపిరి తిత్తుల సమస్యల బారిన పడ్డారని అన్నారు. వారికి క్షయ వ్యాధి సోకే ప్రమాదం ఉందని అన్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ ఆసుపత్రులలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయితే ప్రభుత్వమే వైద్య సాయం కోసం రూ. 500ల నగదును అందిస్తుందని తెలిపారు. కావున క్షయ వ్యాధి పట్ల అందరు అప్రమత్తత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ రంగనాథం, ఆర్పే శోభ, అంగన్ వాడి టీచర్ రాధా, ఎఎన్ఎం మాధవి, ఆశ వర్కర్ సుజాత, స్పెషల్ ఆఫీసర్ జగన్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.