schedule Saturday, July 04, 2026

పరిసరాల పరిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం

calendar_today June 7, 2022
person dharshininews
పరిసరాల పరిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం
పరిసరాల పరిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం - పట్టణ ప్రగతి ప్రత్యేకాధికారి వినయ్ కుమార్ - పలు వార్డుల్లో పర్యటన, సమస్యలపై ఆరా తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రత‌కు ప్రాధాన్య‌మివ్వాల‌ని పట్టణ ప్రగతి ప్రత్యేకాధికారి వినయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేడపతున్న పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం ప్రత్యేకాధికారి వినయ్ కుమార్ తాండూరు పట్టణాన్ని సందర్శించారు. మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ రంగనాథం, ఏఈ ఖాజాలతో కలిసి పట్టణంలోని 1, 2, 6వ వార్డులలో పర్యటించారు. ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు బాలప్ప, మధుబాల, రవిల సమక్షంలో ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వార్డుల్లో చేపడుతున్న పారిశుద్ధ్య వ్యవస్థ విధానాలను ప్రజలను అడిగి ఆరా తీశారు. ప్రజలతో మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి అందించాలని సూచించారు. ముఖ్యంగా ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఓ కాలనీలో మిషన్ భగీరథ తాగునీటి సమస్య దృష్టికి రావడంతో ఆ శాఖ జిల్లా అధికారులతో ప్రత్యేకాధికారి వినయ్ కుమార్ మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. మరోవైపు పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్ అధికారులు 6వ వార్డులో తెరిచి ఉన్న బోరు బావులను మూయించి వేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ ప్రగతి సూపర్ వైజర్ రమేష్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.