పట్టణ ప్రగతితో సమగ్రాభివృద్ధి
June 7, 2022
dharshininews
పట్టణ ప్రగతితో సమగ్రాభివృద్ధి
- మున్సిపల్ చైర్ పర్సన్ టీ.స్వప్న పరిమళ్
- వార్డులో పర్యటించి సమస్యల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిలో తాండూరు పట్టణ సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని మున్సిపల్ చైర్పర్సన్ టీ.స్వప్న పరిమళ్ పేర్కొన్నారు. తాండూరులో పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సహాంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తన వార్డు 27లో పర్యటించారు. వార్డులోని పలు కాలనీలలో తిరిగి ప్రజల సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, ఇందుకోసం పట్టణ ప్రగతిని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంతో పట్టణంలోని సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి జరుగుతోందన్నారు. పట్టణ ప్రగతితో తాండూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో సమస్యలను గుర్తించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. దీంతో పట్టణ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. పారిశుద్ధ్యాన్ని సక్రమంగా అమలు చేయాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


