schedule Saturday, July 04, 2026

జర్నలిస్టు కుటుంబానికి ఎంపీ రంజిత్ రెడ్డి చేయూత

calendar_today June 19, 2022
person dharshininews
జర్నలిస్టు కుటుంబానికి ఎంపీ రంజిత్ రెడ్డి చేయూత
జర్నలిస్టు కుటుంబానికి ఎంపీ రంజిత్ రెడ్డి చేయూత - రూ.3లక్షల సీఎంఫ్ అందజేసిన ఎంపీ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తాండూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు రమేష్ ఠాకూర్ కుటుంబానికి ఆర్థిక‌ చేయూతనందించారు. ఇటీవ‌లే రమేష్ సోదరుడు సురేష్ ఠాకూర్ అనారోగ్యానికి గురయ్యాడు. ఆయనకు ముంబైలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇందుకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో రమేష్ వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గాజీపూర్‌కు చెందిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ చారిని సంప్రదించగా ఆయన ఈ విషయాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి. దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఎంపీ రంజిత్ రెడ్డి పీఎంఎఫ్ ద్వారా రమేష్ కుమార్ కుటుంబానికి రూ. 3 లక్షల చెక్కును రమేష్ కు అందజేశారు. అదేవిధంగా రమేష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎంపీ రంజిత్ రెడ్డి అందించిన చేయూతకు జర్నలిస్టు రమేష్ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.