schedule Saturday, September 12, 2026

అమ్మాయిలను వేధిస్తే శిక్ష త‌ప్ప‌దు

calendar_today June 20, 2022
person dharshininews
అమ్మాయిలను వేధిస్తే శిక్ష త‌ప్ప‌దు
అమ్మాయిలను వేధిస్తే శిక్ష త‌ప్ప‌దు - వారిని కాపాడుకోవ‌డం అంద‌రి బాధ్య‌త‌ - తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ - ఆకట్టుకున్న స్వస్తిక్ అకాడమి నృత్య ప్రదర్శన తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : అకార‌ణంగా అమ్మాయిల‌ను వేధిస్తే శిక్ష త‌ప్ప‌ద‌ని తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం తాండూరు పోలీసుశాఖ సహాకారంతో పట్టణంలోని శ్రీ స్వస్తిక్ ఆర్ట్స్ డ్యాన్స్ అకాడమి ఆధ్వర్యంలో ఓ మగువా మేలుకో.. నిన్ను నువ్వు కాపాడుకో... అనే కార్యక్రమంతో అమ్మాయిల రక్షణపై అవగాహన కల్పించారు. పట్టణంలోని భద్రేశ్వర చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డీఎస్పీ శేఖర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అమ్మాయిలను రక్షించడం అందరి బాధ్యత అన్నారు. ప్రేమ పేరుతో గాని, ఇతర అంశాలతో గాని మైనర్ అమ్మాయిలను వేధిస్తే చర్యలు తప్పవన్నారు. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలపై వేధింపులకు పాల్పడితే ఫోక్సో చట్టం కింద శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. అదేవిధంగా అమ్మాయిలు ఎలాంటి సమయాలలో అయినా ఆపదలో ఉంటే పోలీసులను, షీటీంలను సంప్రదించాలన్నారు. అంతకుముందు శ్రీ స్వస్తిక్ ఆర్ట్స్ డ్యాన్స్ అకాడమి ఆధ్వర్యంలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. చక్కని సందేశం ఇచ్చిన కళాకారులను డీఎస్సీ శేఖర్ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు వేణుగోపాల్ గౌడ్, మహిపాల్ రెడ్డి, స్వస్తిక్ ఆర్ట్స్ డ్యాన్స్ అకాడమీ అధ్యక్షులు రమేష్, మాస్టర్లు సచిన్, పవన్ కుమార్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.