schedule Saturday, July 04, 2026

పైలెట్‌తోనే అభివృద్ధిలో దూకుడు

calendar_today June 24, 2022
person dharshininews
పైలెట్‌తోనే అభివృద్ధిలో దూకుడు
పైలెట్‌తోనే అభివృద్ధిలో దూకుడు - ఆద‌ర్శ తాండూరుకు రోహిత్ రెడ్డి కృషి - రోడ్డుప‌నుల ప‌రిశీలిన‌లో అఫ్పూ(నయూం) తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితోనే తాండూరు అభివృద్ధిలో దూసుకుపోతుంద‌ని టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం) అన్నారు. శుక్ర‌వారం ప‌ట్ట‌ణంలోని ఇందిరా చౌర‌స్తా నుంచి ప్రారంభ‌మైన జాతీయ ర‌హ‌దారి లింకురోడ్డు ప‌నుల‌ను అఫ్పూ(న‌యూం) స్థానిక నేత‌ల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అఫ్పూ(న‌యూం) మాట్లాడుతూ కోట్లాది రూపాయిల‌తో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరును అభివృద్ధి ప‌రుస్తున్నార‌ని అన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరును ఆద‌ర్శంగా తీర్చిదిద్ద‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ద‌శ‌ల వారిగా అభివృద్ధి చేస్తూ ప్ర‌జ‌లకు ఇచ్చిన హామిల‌ను నెర‌వేరుస్తున్నార‌ని అన్నారు. దీంతో పార్టీ నాయ‌కులతో పాటు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌రుస్తున్నార‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం. శ్రీ‌నివాస్, కౌన్సిల‌ర్ అస్లాం, నాయ‌కులు త‌దిత‌రులు ఉన్నారు.