schedule Saturday, July 04, 2026

టీఆర్ఎస్ నేతలకు కీలక పదవులు

calendar_today June 26, 2022
person dharshininews
టీఆర్ఎస్ నేతలకు కీలక పదవులు
టీఆర్ఎస్ నేతలకు కీలక పదవులు - తాండూరు అధికార ప్రతినిధిగా రాజుగౌడ్ - తాండూరు మహిళ కన్వినర్‌గా శకుంతల - నియామక పత్రాలు అందించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : టీఆర్‌ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గంలో స్థానిక నేతలకు కీలక పదవులు వరించాయి. తాండూరు నియోజకవర్గ టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా పార్టీ సీనియర్ నేత ఎస్. రాజుగౌడ్(తాండూరు పట్టణం)ను నియమిస్తూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం నియామక ఉత్తర్వులను రాజుగౌడ్ కు అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు..అభివృద్ది పనులను ప్రజలకు వివరించడంతో పాటు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారంను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు శ్రీ రాజుగౌడ్ సేవలు పార్టీకి అవసరం అని భావించి ఆయనను పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా నియమించడం జరిగిందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని కూడా ఎమ్మెల్యే తెలిపారు. మహిళ కన్వినర్‌గా శకుంతల అదేవిధంగా పార్టీకి సుదీర్ఘంగా సేవలు అందిస్తూ, మహిళలను సంఘటితం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన శకుంతల(గౌతాపూర్, తాండూరు మండలం)ను పార్టీ నియోజకవర్గ మహిళా విభాగం కన్వీనర్ గా నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు తెలిపారు. ఆదివారం శకుంతలకు నియామక పత్రంను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. శకుంతల సేవలు పార్టీకి చాలా అవసరం అని..మహిళలకు చేసిన సేవలను గుర్తించి ఆమెను పార్టీ నియోజకవర్గ మహిళా విభాగం కన్వీనర్‌గా నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్‌ విఠల్ నాయక్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), మండల అధ్యక్షులు రాందాస్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, డైరెక్టర్ మల్లప్ప, నాయకులు నర్సిరెడ్డి, పటేల్ ఉమాశంకర్, సలీం, మాజీ ఉపసర్పంచ్ హసన్ పటేల్ తదితరులు ఉన్నారు.