schedule Saturday, July 04, 2026

30న ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు

calendar_today June 28, 2022
person dharshininews
30న ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు
30న ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు - ప్రకటించిన మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, దర్శిని ప్రతినిధిః రాష్ట్ర ప్రభుత్వం ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల వెల్లడిపై స్పష్టత ఇచ్చింది. ఈనెల 30న విడుద‌ల చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 30న గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు పదో తరగతి ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నట్లు వెల్లడించారు. మే 23 నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు కొన‌సాగిన విష‌యం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మందికి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో 99 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలకు హాజరయిన విద్యార్ధులు ఈనెల 30న అధికారిక వెబ్‌సైట్‌ www.bse.telangana.gov.in లేదా www.bseresults.telangana.gov.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.