schedule Saturday, September 12, 2026

పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి

calendar_today July 3, 2022
person dharshininews
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి - సోష‌ల్ మీడీయా పోస్టుల‌ను న‌మ్మొద్దు - అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదు - తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పండుగలను అందరం ప్రశాంతంగా జరుపుకుందామని తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ అన్నారు. బ‌క్రీద్ పండ‌గ‌ను పుర‌స్క‌రించుకుని ఆదివారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం వేల్పేర్, మత పెద్దలతో కలిసి సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శేఖ‌ర్ గౌడ్ మాట్లాడుతూ బక్రీద్ పండగ సందర్భంగా సమావే దశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమాజంలో ముస్లిం సోదరులు, హిందూ, క్రైస్తవ సోదరులు సమన్వయంతో ముందుకుసాగాలన్నారు. అన్ని పండగలను శాంతియుతంగా.. ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. వచ్చే బక్రీద్‌ పాటు ఆ తరువాత వచ్చే పండుగలకు అందరు సహకారం అందించాలన్నారు. తాండూరులో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల‌కు తోడ్పాటు అందించే బాధ్యత అందరిపై ఉందన్నారు. అదేవిధంగా పండగ సమయాల్లో గాని, ఇతర సమయాల్లో గాని వాట్సాఫ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో ఎవరైనా అసభ్యకరంగా.. అసందర్భంగా వచ్చే సందేశాలను నమ్మరాదని సూచించారు. అలాంటి దుశ్చర్యలతో శాంతిభ‌ద్ర‌త‌ల విఘాతానికి పాల్ప‌డితే ఎంత‌టి వారినైనా ఉపేక్షించేది లేదని, అలాంటిపై చర్యలు తప్పక ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు రాజేందర్ రెడ్డి, రాంబాబు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.